"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 56,వ బాగం) "నాగమణి రావులపాటి "
 తెల్లవారింది కుసుమ రాహుల్ ని రమ్మని కబురు చేసింది .... బాబాయి ఇంటికి స్వయంగా వెళ్ళి
అన్ని విషయాలూ కూలంకుషంగా చెప్పి నేను 
ముందు వెళ్ళి వాళ్ళను కలిసి వస్తాను తరువాత
పెళ్ళి గురించి మాట్లాడవచ్చు ఈ రెండు రోజులూ
మీరు తమ్ముడు చెల్లి దగ్గర వుండండి అని అనగానే
అలాగే తల్లి నీవు నిశ్చింతగా వెళ్ళిరా అన్నాడు
కుసుమ బాబాయి ...........!!
ముసిరిన చీకటిలో జాబిలి కురిపించే చల్లని వెన్నెల
మనసున మురిసే కమ్మని భావాల తలపుల చెరసాలలో బందీలై మసలిన ప్రేమకు వేకువ 
వేడి కిరణాలు తాకిడికి విడుదలైన ప్రేమపక్షలై
కలయో ఇలయో తెలియని అయోమయంలో
సాగే పయనం ............!!
రాహుల్ కుసుమలు హృదిలో మెదిలిన గడిచిన
సంఘటన జ్జప్తికి వచ్చింది.....!! రాహుల్  కుసుమల
ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళి ఎన్నో ఆశలతో తాము కూడా
 వివాహం చేసుకుని హాయిగా వుందాం అని కన్న
కలలు కల్లలై అనుకోని సంఘటనల నడుము
విడిపోవటం ఒక విషాదంగా ముగిసింది........!!
మళ్ళీ పెళ్ళి అనే పద వినోదానికి పదనిసల రాగాల
పయనం తమకు పెళ్ళి మంత్రాలైనట్టుగా తోచి 
ముసి ముసి నువ్వుల సిగ్గు దొంతరలతో  బుగ్గలు 
కెంపులైన కుసుమను చూసి రాహుల్ కన్నార్పకుండా
చూస్తుంటే కాలానికి ముచ్చటేసి కదలిక లేదేమో అనిపించింది............!!
గీత వాళ్ళు అమ్మగారి ఇంటికి వెళ్ళే దారిలోనే రాహుల్ దిగి పోయాడు  అమ్మా నాన్నల దగ్గరికి
వెళ్ళి  తిరుగు ప్రయాణంలోఇద్దరూ కలిసి
వెళ్ళేటట్టు నిర్ణయించుకున్నారు....ఇంట్లోకి అడుగు
పెడుతూనే వేణు ఎదురై హాయ్ కుసుమా ఎన్నాల్టికి
చూసాను....ఎలా వున్నావు అని కుశల ప్రశ్నలు
వేసాడు...లోపలికి కూడా రానీయవారా అనిగీత
సరదాగా అనేసరికి నవ్వుకున్నారంతా.......!!
ఇంతలో గీత అమ్మగారు ఏమ్మా కుసుమా అంతా
కులాసా యేనా గీత అంతా చెప్పింది నిన్ను చూస్తే
నాకు చాలా గర్వంగా వుంటుంది అని అన్నారు
అందరూ కులాసానే ఆంటీ అంకుల్ ఇంట్లో లేరా
అని మాట కలిపింది కుసుమ.‌‌......!!
వేణుని చూసింది కుసుమ అల్లరిగా తనతో ఎంతో
సరదాగా వుండే వేణు చాలా హేండ్ సేమ్ గా
తయారయ్యాడు అసలే మంచి కలర్ చక్కని 
ముఖారవిందం గిరజాల జుట్టుతో అందమైన కళ్ళు
కోరి మీసాలు సినిమా హీరోలా వున్నాడు బయటికి 
వెళ్ళటానికి తయారయి వీళ్ళు రాకతో ఆగాడు.....!!
 ఏంటి కుసుమా అలా చూస్తున్నావు నాకు సిగ్గుగా
వుంది అని చమత్కరించాడు వేణు డాక్టర్లు కూడా 
సిగ్గుపడతారా సరేలే త్వరగా రా నీతో మాట్లాడాలి 
అని కుసుమ అనగానే బాబోయ్ నీ చేతిలో
బుక్కయ్యానే తప్పుతుందా చిన్న పని చూసుకుని 
వస్తాను అని తన కార్ లో బైటికి వెళ్ళాడు వేణు 
(సశేషం)...................

కామెంట్‌లు