"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 58,వ బాగం)-నాగమణి రావులపాటి "
 రాహుల్ చాలా హేండ్ సమ్ గా తయారయ్యాడు
ముఖం లో ఆనందం కళ్ళలో ప్రస్పుటంగా
కనిపిస్తుంటే ఎన్నాళ్ళయింది మిమ్మల్ని ఇలా చూసి
నావల్లే నావల్లే మీరు అన్ని ఆనందాలకూ దూరమై
మనసును చాలా కష్ట పెట్టుకున్నారు అని అన్నది
కుసుమ.................!!
గడిచిన దానికి వగచే కంటే  వర్తమానం 
అందంగా తీర్చి దిద్దు కోవటంలోనే ఆనందం
వుంది... అదంతా వదిలేయ్ మనది జన్మ జన్మల
బంధం అందుకే కలిసాము మూడ్ చేంజ్ చేసుకోకు
అంటూ టేప్ ఆన్ చేసాడు చిరంజీవి రాధికల
నచ్చింది మల్లెచెండు అనే పాట పాట పెట్టాడు.‌....!!
అంతే చిన్నపిల్లలా మారిపోయింది కు‌సుమ
పాటలు వింటూ రాహుల్ నే చూస్తూ ఏదో లోకంలో
విహరించేస్తోంది కుసుమ అల్లరిని తన్మయత్వానికి
ముగ్దుడయ్యాడు రాహుల్ ...అమ్మాయి గారికి 
జోష్ వచ్చిందే ఇదే నీలో చూడాలి నేను అని 
కుసుమా అని గోముగా పిలిచాడు రాహుల్......!!
ఏంటి అన్నట్టు ముఖం పెట్టింది మనం ఇద్దరం
కలిసి గ్రామదేవత గుడికి వెళ్ళి ముడుపు కట్టాం
గుర్తుందా అలా చేసాం కాబట్టే మనని విడిపోకుండా
కలిపింది మళ్ళీ ఇద్దరం వెళ్ళి అమ్మవారికి 
కృతజ్ఞతలు చెప్పి వద్దాం ఓకేనా అని అన్నాడు
రాహుల్ సరే అలాగే కానీ అని కుసుమ అనగానే
రాహుల్ ఆ దిశగా కారు దిశ మార్చాడు......!!
గుడిలో అమ్మవారి దర్శనం చేసుకుని ఆ ప్రశాంత
వాతావరణంలో ఏకాంతంగా ఇద్దరూ కాసేపు గడిపి
మళ్ళీ ప్రయాణం సాగించారు..‌ఎన్నో విషయాలు 
మరెన్నో తీపి జ్జాపకాలను మదిలో ఇముడ్చుకుని
ప్రయాణం సుగమం కాగా కుసుమను ఇంటివద్ధ
దింపేసి రూమ్ కు వెళ్ళాడు రాహుల్.....!!
కుసుమ ఒక పట్టుదల కుసుమ ఒక ప్రేమమూర్తి
కుసుమ ఒక బాధ్యత కుసుమ ఒక నియంత 
కుసుమ ఒక ప్రముఖ వ్యాపార వేత్త  ఒక స్నేహం
బంధాలను బాధ్యతగా ఎంచి ఆప్యొయతలను
ఒడిలో నింపుకున్న అనురాగం దేవత (సశేషం)....!!

కామెంట్‌లు