"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 59,వ, బాగం)-- "నాగమణి రావులపాటి "
 కుసుమ ఇంటికి వెళ్ళగానే బాబాయిని కలిసింది వాళ్ళను కలిసిన విషయం ...వాళ్ళందరికీ పూర్ణిమ
నచ్చిన విషయం చెప్పి ఫార్మాలిటీ కోసం ఒక
మంచిరోజు చూసుకుని కబురు చేస్తాం పూర్ణాను
చూసి ఆరోజే మంచి  చెడులు మాట్లాడుకుందాం
అని అన్నారు బాబాయ్ అని అన్నది కుసుమ.....!!
పోనలేమ్మా అన్నయ్యా వదినలు లేకపోయినా
వాళ్ళని చక్కగా తీర్చి దిద్దావు దేవుని దయవలన
దానికి చక్కని సంబంధం  దొరికింది అలాగే నీకూ
ఒక మంచి సంబంధం కుదిరితే నీవు కూడా వివాహం
చేసుకుని హాయిగా వుండు తల్లి ...........!!
ఇంకా వైభవ్ కూడా పెద్దవాడు అయ్యాడు కదా
వాడి గురించి బెంగ వద్దు వాడికి మనమంతా
వున్నాము కదా ఏమంటావు కుసుమా అని అన్నాడు
బాబాయి... నాగురించి ఎందుకులే  బాబాయ్ ముందు
పూర్ణా పెళ్ళి కానీయండి నాకు ఎవరు వున్నారు ...
మీరు పిన్ని మీఇద్దరి చేతులమీద దాని వివాహం
జరిపించండి అని అన్నది కుసుమ.‌......‌!!
అలాగే నీవేమీ కంగారు పడకు అన్నీ సవ్యంగానే
జరుగుతాయి వాళ్ళు కూడా నీకు సపోర్ట్ గానే
వుంటారు కదా ఇంకా ఎందుకమ్మా దిగులు అని బాబాయి అనగానే ఔననుకోండి ఎందుకో దాని పెళ్ళి
ప్రస్తావన వచ్చినప్పటినుండి నాకు కాళ్ళూ చేతులూ
ఆడట ల్లేదు బాబాయ్ అని ఇక వెళ్ళి వస్తాను
అని ఇంటి ముఖం పట్టింది కుసుమ..........!!
కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు వైభవ్ కాఫీ
బిజినెస్ పనిమీద అప్పుడప్పుడూ వైజాగ్ వెళ్ళి
వస్తూ వుండేవాడు మొదట్లో కుసుమ వైభవ్ ను
వెంటతీసుకుని వెళ్ళేది అతనికి కూడా వ్యాపార
మెళకువలు తెలియాలని అలా తమ్ముడికి కాస్త
అలవాటు కాగానే ఒక్కడిని పంపటం అవసరమైతేనే
తను వెళ్ళటం మొదలేట్టింది..........!!
ఈ క్రమంలో వైభవ్ ఒక్కడే వైజాగ్ వెళ్ళాడు  అక్కడ
కంపెనీ ఓనర్ ను కలిసే క్రమంలో వాళ్ళు కుమార్తెతో
పరిచయం కలిగింది వాళ్ళు కన్నడ బ్రాహ్మణ్స్
వైజాగ్ లో సెటిల్ అయ్యిరు....ఆ అమ్మాయి పేరు 
నీలిమ కుందనాల బొమ్మలా వుంటుంది‌‌......!!
తను స్టడీ నిమిత్తం అమెరికా వెళ్ళింది. అక్కడ తనకి జాబ్ వచ్చింది ఈలోగా ఒక నెలరోజులు తల్లి 
తండ్రులు వద్ద గడిపి వెళ్దామని ఇండియా వచ్చింది
వైభవ్ కంపేనీ ఓనర్ ని  ఇంటివద్దే కలవటానికి
వెళ్ళాడు అక్కడ నీలిమతో వైభవ్ కు పరిచయం
ఏర్పడింధి(సశేషం)...............!!

కామెంట్‌లు