"నీ జ్జాపకం నాతోనే"1980 (ధారావాహిక 60,వ,బాగం) "నాగమణి రావులపాటి "
 వాళ్ళు ఇంట్లోనే  రెండు రోజులు ఉండి పోవాల్సి వచ్చింది వైభవ్ కు ఒక రూమ్ కేటాయించారు 
ఈ రెండు రోజులూ నీలిమ వైభవ్ కు చాలా దగ్గరైంది
నీలిమ బాగా కలుపుగోలు పిల్ల చిలిపితనం ఎక్కువే
మాటలతో మెస్మరైజ్ చేసేస్తుంది..వైభవ్ ను ఇట్టే
ఆకట్టేసింది..........!!
చక్కని వర్చస్సు సరిపడా శరీర సౌష్టం కోటేరులాంటి
ముక్కు దొండపండు పెదవులు ఆందమైన చెక్కిళ్ళు
ముత్యాల పలువరుస చురంకైన కనులు 
గలగల పారే శలయేరు ఆమె మాటలు ఒలవడి
పసుపు పచ్చని మేని ఛాయ నడక కలహంసనే...!!
అలాంటి నీలిమ సొగసులకు ముగ్ధుడై పోయాడు
వైభవ్ ఒక నిమిషం కూడా వొదిలి లేదు వైభవ్ ను
దొరికావా దాని చేతికి... ఇక అంతే ఏమీ అనుకోకు
వైభవ్ దానికి నచ్చకపోతే తిరిగి కూడా చూడదు
నచ్చితే వదలదు ఇంకా నెల రోజుల్లో అమెరికా
వెళ్ళిపోతుంది అని నీలిమ ఫాదర్ అన్నారు...!!
ఇంతలో నీలిమ... వైభవ్ మీ బిజినెస్ ఇండియా
 మొత్తం విస్తరిస్తోంది  అమెరికాలో మన తెలుగువాళ్ళు
బాగానే వున్నారు అక్కడ  మీ బ్రాంచి ఓపెన్
చెయ్యొచ్చు కదా అని అన్నది నీలిమ...
చెయ్యొచ్చు మేము ఎప్పుడూ ఆలోచించలేదు 
అని అన్నాడు వైభవ్......‌‌......!!
నిజమే వైభవ్ నీలిమ అన్నట్టు మీ వ్యాపారం అక్కడ కూడా  అభివృద్ధి చేయొచ్చుగా నాకు కొడుకులు
లేరు నీలిమ ఒక్కతే సంతానం నీలిమకు దీనిమీద
అవగాహన లేదు నీవు ఓకే అంటే అన్ని ఏర్పాట్లు
నేను చేస్తాను అని అన్నారు ఆయన.......!!
ఔనండీ మీరు చెప్పేది బాగుంది కానీ మా కుసుమ
అక్కకు చెప్పి తాను ఏ నిర్ణయం తీసుకుంటే దానినే
తూ చా తప్పకుండా పాటిస్తా అని అన్నాడు
వైభవ్... ఓకే నేను కుసుమ గారితో మాట్లాడుతా
ఆమెకు నాపై విశ్వాశమే అని అన్నారు ఆయన...!!
 సరే సార్ ఇంకా నేను బయలు దేరుతాను మీకు
మీ ఆతిథ్యానికి చాలా థాంక్స్  నీలిమ గారు
మీకు కూడా థాంక్స్ మీ ఫ్రెండ్షిప్ లో టైమ్ ఇట్టే
గడిచి పోయింది  అని అన్నాడు వైభవ్ ఓకే లక్
వుంటే మీరు అమెరికా వెళ్ళొచ్చు వీలైతే నేను
మీ ఊరు వస్తాను డాడీని తీసుకుని అని చెప్పి
రైల్వే స్టేషన్ కు వచ్చి సెండాఫ్ ఇచ్చింది (సశేషం)

కామెంట్‌లు