నాన్న(మణిపూసలు);-పి. చైతన్య భారతి 7013264464
1. 
అనుబంధాల గంధం 
శాశ్వతమైన బంధం 
మన జీవిత ఆలంబన 
నాన్నేగ దృఢబంధం 
2. 
బుడిబుడిబుడి అడుగులకు 
బిడ్డలాడు మాటలకు 
ప్రతినిత్యం ఆసరవును 
ఆనందపు చేతలకు! 
3.
నీతి కథల బోధించును
అనుభవాలు వివరించును 
ఎదుగుదలకు మురిసిపోతు 
చూపుతోడ బెదిరించును!
4.
రెండక్షరాల నాదం 
జీవితమంతా మోదం 
నాన్న మనకు తోడుంటే 
బిడ్డలకదే ప్రమోదం! 
5.
కనుల కొలనులొ రానీక 
కన్నీరు కనబడనీక 
రేయింబవళ్లు శ్రమించు 
కుటుంబానికి వెన్నెముక!
6.
బిడ్డ భావి వృక్షానికి 
సంస్కారమిచ్చు భవితకి 
పరోక్ష దైవమె నాన్న 
తనదు వంశ అభివృద్ధికి! 
7.
లోన సంసార భారం 
మోము నవ్వుల సమీరం 
స్థిత ప్రజ్ఞతగల నాన్న 
మాటల్లో  గoభీరం !
8.
కష్టాలను ఇష్టముగా
కుటుంబపు చుక్కానిగా 
అలుపెరగని బాటసారి 
ఆమనిలో కోయిలగా! 
9. 
మిత్రులకు ఇష్టసఖుడు 
బంధువులకాత్మీయుడు 
లోకానికజాత శత్రువు 
నాన్నే మన నాయకుడు! 
10. 
బాధ్యతలే లేని నాన్న 
వ్యసనాలలో కడు మిన్న 
బిడ్డల బతుకు చీకటే 
వారి శాపమె ఆనాన్న !


కామెంట్‌లు