పిల్లల్లారా రారండోయ్ ;-చైతన్య భారతి పి రంగారెడ్డి జిల్లా 7013264464
మల్లె వనము కెళదాము 
అల్లరి బాగా  చేద్దాము 
తెల్లని పూలు కోద్దాము 
పిల్లలారా రారండోయ్ !

జల్లు వాన కురిసింది 
చల్లని పాట పాడింది 
చెల్లిని ప్రేమించమంది 
గిల్లవద్దు పూలనోయ్! 

ఉల్లమందు మహారాణి 
ఘల్లుఘల్లు గజ్జెల బాణి 
వల్లెవేయు పదాల వాణి 
అల్లరిలో ఘనమండోయ్!

నల్లనేరేడు తిన్నదంట 
మల్లితో ఆడుకుందట 
ఉల్లిని కోసి ఇచ్చిందట 
చల్లని మనసే నండోయ్ 

చిల్లు పడెను కుండకు 
సొల్లు కబుర్లు చెప్పకు
బల్లి లాగా వెంట పడకు 
గల్లిలోనా తిరగకోయ్!


కామెంట్‌లు