నేను అడవిని వెన్నెల్లో ఆడుకుంటున్నాను
తల పైన ఉన్నాయెన్నో నక్షత్రాలు
నా పచ్చని పిల్లలతో నృత్యం చేస్తున్నాయి
వీచే గాలితో, ఆకాశానికి సందేశాలు
పంపుతున్నాయి
ఇప్పుడు ఇక్కడ ప్రతి సన్నివేశం ఒక అద్బుత
దృశ్యం
2
నేను అడవిని మాట్లాడుతున్నాను
నేడెందుకో చీకటికి ఆలస్యమైంది
వెలుగుదే రాజ్యమైంది.
గూళ్ళల్లో పక్షి పిల్లలు ఎదురు చూస్తున్నాయి
ఎక్కడో అడవి కాలిన వాసన
మంటలు దావానలంలా వ్యాపించాయి
ఆకాశంలో తిరుగుతున్న తల్లి మనసు
తల్లడిల్లింది
గూటికి చేరలేని అసహాయ స్థితి.
3
నేను అడవిని మాట్లాడేందుకు మాటలు
రావడం లేదు
నేడెందుకో వెలుగు ఆలస్యంగా మేల్కొంది
చీకటి కళ్ళు ఎర్రబడ్డాయి
ఆనందాలన్నీ,మంటల్లో ఆహుతి కాబోతున్నాయి
పిల్లల కోసం ఆరాటపడుతుంది
4
నేను అడవిని వరుణ దేవుడిని వేడుకుంటున్నా
వర్షం కురిపించమనీ, మంటలు చల్లార్చమనీ
పిల్లల్ని రక్షించుకునేందుకు తల్లి తన్లాడుతుంది
గూటికి వేడి తగలకుండా గడ్డి పరకలతో
మూసేసింది.
5
నేను అడవిని వరుణుడు కరుణించాడు,
కుండపోతగా వర్షం కురిసింది
గూటికి చేరింది తల్లి, పిల్లల కళ్ళల్లో మెరుపులు!
( మంటల్లో చిక్కుకున్న తన పిల్లలను చూసి లావుక
పక్షి పడే వేదనను,నన్నయ్య గారు రాసిన పద్యం స్ఫూర్తితో...)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి