కుంకుడు కాయలు ; -సమ్మోహనాలు (746-755); -ఎం. వి. ఉమాదేవి
శుభ్రపరచే కాయ 
కాయ చేదగు మాయ 
మాయగా నురుగుతో మలినాలు తొలగు ఉమ !

నాల్గు కాయలు చాలు 
చాలు పొంగె నురగలు 
నురగలకు వేడినీట నానాలిక ఉమా !

వెండి బంగరు నగలు 
బంగారు వస్తువులు 
వస్తువుల మురికినే తొలగించునో ఉమా !

గిన్నెలును సీసాలు 
సిసాలు డబ్బాలు 
డబ్బాలకిది మెరుపు తళతళా కద ఉమా !

అడవి కుంకుడు కాయె 
కాయ నేడది పోయె 
పోయెనే పెరటిలో ఓషధులు నేడుమా !

చిన్ని కాయలు ఉండు 
గింజలును నలిగుండు 
నలిగి పండుగరోజు నలుగురకు  స్నానముమ !

పిల్లలకి పెద్దపని 
పెద్దలకి తగ్గు పని 
పనిలోని వినోదం తెలియాలి ఓ ఉమా !

జిడ్డు ముఖముకి వెలుగు 
వెలుగు శుభములు కలుగు
కలుగునే మొటిమలకి నివారణ   కద ఉమా !

చర్మ రంధ్రాలలో 
రంధ్రము చివరిలో 
చివరలో చొచ్చుకొని జిడ్డువదులును ఉమా !

అడవి బిడ్డకుపాధి 
ఉపాధికి అనువుయిది 
అనువుగా ఏరుకొని సంతలో అమ్ము ఉమ !

కామెంట్‌లు