మా హక్కు లేవీ!!?;-ప్రతాప్ కౌటిళ్యాశ్రీ శ్రీ కళా వేదిక అధ్యక్షులు జిల్లా నాగర్ కర్నూల్ 8309529273
ఎన్ని
వాదనలు చేసిన
అనువాదాలు -వేదాలు
చదివిన
ఉన్నతవిద్యలు-చదివిన

భారత రాజ్యాంగంలో
అనాథల హక్కు లేవీ!!?

మాకు
రేషన్ కార్డు లేదు!
క్యాస్టు సర్టిఫికెట్ లేదు!!

ఆధార్ కార్డు లేదు!
ఐ డి కార్డు లేదు!
అమ్మానాన్నలు లేరు!!
ఇల్లు లేదు!!?

చదివేది ఎలా?
ఉద్యోగం పొందేది ఎలా??
ఓటు వేసేది ఎలా!!?
గుర్తింపు పొందేది ఎలా!!?

భారత రాజ్యాంగంలో
మా అనాథల హక్కులు ఏవి!?కామెంట్‌లు