బాలగేయం;-మమత ఐలకరీంనగర్9247593432
ఫాదర్సడే  సందర్భంగా
=================
బుడిబుడి అడుగులు వేయించి
బిడ్డలనెదపై లాలించి
కష్టనష్టాలు కాననెకానడు
కన్నతండ్రి పిల్లల నెంచి

రొక్కమునే సంపాదించి
విద్యాబుద్ధులు నేర్పించి
యెదిగిన కొద్ది సంతసించును
కన్నతండ్రి పిల్లల నెంచి

రేయింబవళ్లు శ్రమియించి
మురిపెముగా సుధ‌లొలికించి
ఇంటికి తానే కంచెగ మారును
కన్నతండ్రి పిల్లల నెంచి

మోటు భారముకు తలవంచి
మూటలనంతా దాచుంచి
బిడ్డలకనుచు వాటాలిచ్చును
కన్నతండ్రి పిల్లల నెంచి


కామెంట్‌లు