నిత్య చైతన్యులు;- పెందోట వెంకటేశ్వర్లు సిద్దిపేట9440524546
రండి రండి పిల్లలు
 రతనాల మూటలు 
చిరునవ్వుల మొక్కలు 
ఆనందాల సెలయేళ్ళు 

ఆటలు ఊటలు
 పాటల పరవళ్ళు
 అల్లరి ఎంత చేసిన 
సంతోషమే దుంకును

చిన్ని చిన్ని మాటలు 
నిత్య చైతన్యాలు
చిరునవ్వుల మెరుపులు 
అందుకొనగ రారండు


కామెంట్‌లు