జీవితం ఓ సవాలే!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
      4.కుటుంబం!

19.ఒకనాడు "నడకే" ఉంది!
      నేడు విమానమే ఉన్నది!
       అదే ఎక్కాలని ఉన్నది!
       జీవితం ఓ సవాలే!

20.ఒకనాడు ఇంట్లో వంట!
      వండినదే తినాలంట!
      నేడు తిండంటే బయటే!
      జీవితం ఓ సవాలే!

21.
   తినడానికి అమ్మనిదేది లేదు!  
   అన్నీ అందుబాటులోఉంటే! 
   వంట వ(వి)దిలించుకుంటే!
   జీవితం ఓ సవాలే!

22.
  "సెల్" అంంటి పెట్టుకుంటావ్!
   అదిచ్చినవాడితో ఉంటావా?
   కుటుంబ మంతా ఇలాఉంటే!
   జీవితం ఓ సవాలే!

23.ఖర్చు అదుపులో లేదు!
     ఆదాయం స్థాయి ఎంతైనా!
     అగ్నిలో పోసిన ఆజ్యమే!
      జీవితం ఓ సవాలే!
_________.         (కొనసాగింపు)


కామెంట్‌లు