ఈ తనువు శాశ్వతమని వంద సంవత్సరాలు ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తామని ధైర్యంతో మనిషి ఎంతో శ్రమిస్తాడు. అందంగా ఉండాలన్న ఆకాంక్ష, ఆకర్షణీయంగా ఉండాలన్న కోరిక దానికోసం ఆహార్యం ముఖ్యమని దాని కోసం పడరాని పాట్లు పడి కొత్త కొత్త ఫ్యాషన్ లను కల్పించాలన్న ఆరాటంతో రకరకాల లేపనాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే పద్ధతులతో ప్రజలకు దగ్గరవడానికి ఎంతో కృషి చేస్తాడు. ఈ శరీరం తనదన్న స్వార్థంతో పనులు చేస్తూ ఉంటాడు. జీవం పోయేసరికి తెలుస్తుంది అది తన సొంతం కాదని అలాగే పిల్లల గురించి అనేక ఆలోచనలు. ముందు సంపాదించడం ఎలా ? కుటుంబ పోషణ కోసం కాకుండా జీవితంలో పుష్కలంగా ఉండాలన్న ఆలోచనతో రకరకాల పద్ధతుల్లో ధనాన్ని ఆర్జించి, దానిని దాచే ప్రయత్నం చేస్తాడు మనిషి. కానీ అది ఎంత కాలం పడుతుంది ధనాన్ని ద్రవ్యం అన్నారు ద్రవ్యము అంటే పారేది ఒకచోట నుంచి మరొక చోటుకు పారిపోతుంది. ఆ లక్ష్మీదేవి ఏ క్షణాన ఎవరి పై దృష్టి సారిస్తుందో చెప్పడం కష్టం అయినా మానవ ప్రయత్నం మాత్రం వుంటుంది. అది జ్ఞానమో అజ్ఞానమో తెలియని మూర్ఖత్వం జీవం పోయిన తరువాత విచారించి ఏమిటి ప్రయోజనం?
ప్రాణం కూడా తనకు తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిగా భావిస్తాడు. జీవితంలో జీవన పోరాటంలో గెలుపోటములను గురించి తన పని పూర్తికాగానే జీవం పోతే అప్పుడు తెలుస్తుంది ఇది మన సొంతం కాదు అని తనువును జీవమును నిలుపుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించినా తన చేతులో లేని విషయమని గ్రహించలేని అజ్ఞాని మానవుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి