భారతీ;-జి.లింగేశ్వర శర్మ9603389441
 1
పాడుచుందురునీదుకీర్తనపారవశ్యమునొందుచున్
వేడుకొందురుభక్తితోడనువిద్యలన్నియుపొందగా
జాడజూపవెజీవితమ్మునసాగిముందుకపోవగా
చూడచక్కనిదివ్యసుందరశోభతోజయభారతీ
2.
భక్తులందరుజేరినిన్ గనవాసరేశ్వరి క్షేత్రమున్
శక్తిరూపిణిభక్తపోషిణిశారదాంబను మ్రొక్కుచున్
భక్తితోనినువేడుకొందురుభారమంతయునీదెగా
శక్తియుక్తులనందజేయగశారదాజయభారతీ
3
అక్షయంబగు జ్ఞానసంపదనందజేయవెమాకుసద్
దీక్షబూనియుకోవెలందునదివ్యరూపముగాంచుచున్
భిక్షగైకొనినిష్ఠతోడనుపిల్లలందరుభక్తితో
రక్షనీవనివేడువిద్యలరాణిహేజయభారతీ
4
అందుకోవరహంసవాహినయన్నివిద్యలమూలమై
సుందరమ్మగురూపమందునసుస్మితాననరూపిణీ
వందనమ్మిడుచుంటినీకునువాసరేశ్వరిభక్తితో
పొందగోరుచు జ్ఞానదీప్తినిబుద్ధిగాజయభారతీ
5.
పద్యమొక్కటిరాయబూనితిపంకజాసనగూర్చినే
విద్యలన్నిటిమూలరూపమువిశ్వమందునరాణివే
పద్యవిద్యలనాకుమిక్కిలిపట్టునీయనివేడుచున్
పద్యమందుననీదుకీర్తినిపాడెదన్ జయభారతీ
6.
బాసరందున జ్ఞానరూపిణిభాసురమ్మగుతేజమున్
వ్యాసుడచ్చటసైకతమ్మునవాణిరూపముగూర్చియున్
చేసిపూజలుభక్తితోడుతసిద్దులెన్నియొపొందెమున్
వాసికెక్కెను క్షేత్రమెంతయొవాసరాజయభారతీ
7
వారిజాసనయైసరస్వతివర్గలందునకొండపై
దారిజూపుచునీదుభక్తులదండివిద్యలనిచ్చుచున్
కోరి మ్రొక్కగతీరిపోవునుకోర్కెలన్నియువేగమే
మారిపోవునుజీవనమ్మికమంచిగాజయభారతీ
8.
విద్దెలందున ఖ్యాతినొందగపిల్లలందరిచేతబల్
దిద్దిపించెదరక్షరాలనుదేవిదీవెనలొందగా
ముద్దుముద్దుగచేయిబట్టియుమోకరిల్లుచుముందుగా
శ్రద్దగానినువేడుకొందురుశారదాజయభారతీ
9
అండదండలనందజేయుచునాదుకోవగనెప్పుడున్
కొండపైననువర్గలందునకోమలమ్మగురూపులో
నిండుబంగరుకాంతిశోభలనిత్యపూజలనొందుచున్
దండిగాకరుణించుచల్లనితల్లివేజయభారతీ
10
అన్నివిద్యలమూలరూపిణియాదిశక్తివినీవనిన్
సన్నుతింతురుఛాత్రులందరుశారదానినునిత్యమున్
మిన్నగానిలవాలియంచునుమేదినందునయెప్పుడున్
నిన్నువేడదరమ్మభక్తిగనిత్యమూజయభారతీ

కామెంట్‌లు