🌳 సాహితీబృందావనవేదిక 🌳
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత
********
4️⃣4️⃣1️⃣)
జనజీవనాన పుట్టిన అష్టావక్రులు
అవసరాలు చేసిన కార్మికులు
కన్నవారి అశ్రధ్ధకు మూలాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣4️⃣2️⃣)
కోడికూతతో మొదలౌతుంది ప్రయాణం
ఎండవానలు వీరికి అలంకారం
కాలేకడుపు నింపే ప్రయత్నం
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣4️⃣3️⃣)
రేపటిపౌరులకు ఎందుకో ఈఅవస్థ
వీరిని ఆదరించడంలేదీ వ్యవస్థ
వీరికి కల్గించాలి విముక్తి
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣4️⃣4️⃣
రేపటితరం అడుక్కుతింటుంది వీధుల్లో
పసితనం మసక బారి పోయింది
ఎవరుద్దరించాలి వీరి బ్రతుకులు
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣4️⃣5️⃣)
జనాల వైఖరిమారాలి .
వీరభివృద్ధికి చెయ్యాలి కృషి
మరపురాని బాల్యం అందించాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
బాలకార్మకులు ప్రాథమిక హక్కులు; -డా. భరద్వాజరావినూతల -9866203795
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి