నాన్నకు బహుమతి ;- డా. భరద్వాజరావినూతల 9866203795

 సాహితీబృందావనవేదిక🌳 
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
********* 
4️⃣4️⃣6️⃣)
మానవతామూర్తి  మమకారపు స్ఫూర్తి 
ఓర్పుకు  మారుపేరైన  మూర్తి 
ఎంత కాలమైనా   తరగదు  భక్తి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********  
4️⃣4️⃣7️⃣)
తల్లిప్రేమ  కళ్ళల్లో  చూస్తాము 
నాన్న ప్రేమ  కన్నీళ్ళలో చూస్తాము 
గెలుపు ఓటమిల  కు వారధి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********  
4️⃣4️⃣8️⃣)
ఎవరినైనా పిలవగలం అమ్మని 
ఒక్కరినే  పిలుస్తాం నాన్నని 
మనప్రగతికి సోపానం ఆయన 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********  
4️⃣4️⃣9️⃣)
అమ్మ   కడుపు చూస్తుంది 
జేబుచూసి ఇస్తాడు నాన్న 
చిటి కినవేలు పట్టుకు చూపిస్తాడు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********  
4️⃣5️⃣0️⃣)
డబ్బులిచ్చే ఏటీఎంలు కాదు 
 బ్రతుకు దిద్దే ప్రొవైడర్లు 
మనపాలిట నడిచే దైవాలు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********  
కామెంట్‌లు