అక్షర జ్ఞాన ప్రదాత "శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 
🙏అక్షర జ్ఞానమును
      
     అనుగ్రహించుము మాకు! 
     అక్షర పరంబ్రహ్మ!
      
               శ్రీ సాంబ! సదాశివ! 
    ( సాంబ శివ పదాలు., శంకర ప్రియ )
👌"అ క్షరము" అనగా, వినాశనము లేనిది! శాశ్వత మైనది! అది.. సత్, చిత్, ఆనంద మయమగు సాంబ శివపరంబ్రహ్మము!
    "అక్షరములు" అనగా.. వర్ణములు! అవి, "అ"కారము నుండి, "హ"కారము వరకు ఏబది వర్ణములే.. అక్షర మాల!
👌అక్షరమాల.. "పదునాలుగు మాహేశ్వర సూత్రములు" నుండి 
 నుండి సమకూర్చారు, పాణిని మహర్షి! అవి..
    "అ ఇ ఉన్"  (1) నుండి "హల్" (14) వరకు పదునాలుగు సూత్రములు; నటరాజు, శివుని యొక్క ఢమరుక నాదం నుండి వెలువడినవి
👌అక్షరములు నుండి పదములు, భావములు కలుగు చున్నాయి! ఆ విధముగా.. సంభాషణలు.. సాహితీ ప్రక్రియలు.. గ్రంధ రచనలు.. మున్నగు వాటికి; మూల కారకుడు.. మహాదేవుడు, శివుడు! అట్లే, సకల మానవాళికి.. స్వాత్మ తత్వ జ్ఞానమును, భౌతిక విజ్ఞానమును ప్రసాదించు చున్నాడు, సాంబ సదాశివుడు!
⚜️సీస పద్యము⚜️
 🙏తాధిమ్మి తకధిమ్మి తాండవ మ్మాడుచు; ఢమఢమ ధ్వని తోడ ఢక్క నుండి
   "అ ఇ ఉ ణ్ణు" "అఋ లుక్కు" లక్షరమ్ముల రాల్చి; అమర భాషకు రూప మమర జేసి,
     "సంస్కృత"మ్మను భాష, చక్కగా నిలువగా; సూక్ష్మ రూపమ్మున సూత్రములను
     గుది గ్రుచ్చి తెల్పిన, గురు మహేశుని గొల్తు; వందనమ్ము లిడుదు వందమార్లు!
     (రచన: కోడూరి శేషఫణి శర్మ.,)

కామెంట్‌లు