బాల్యావస్థ "శంకర ప్రియ.," శీల.సంచారవాణి: 99127 67098
 👌ఆట పాటల యందు
     గడిచి పోవు "బాల్యము"
     ఏమీ తెలియని స్థితి
           ఓ తెలుగు బాల!
          ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌"బాల్యము" దేహము యొక్క దశలలో మొదటిది! ఈ అవస్థలో శిశువులు.. పాలను, చీమును, ఒకే విధముగా భావించుతారు! కనుక, బాల్యము.. బహు కష్టమైనది!
👌"బాలావస్థాత్ క్రీడాసక్త:", ఆర్యోక్తి ప్రాకారం; బాల బాలిక లందరూ.. ఆటపాటల యందు ఆసక్తులై యుంటారు! తల్లిదండ్రుల సంరక్షణలో నుంటారు!
👌శిశువు, పసికందు కూన, బిడ్డ, కుఱ్ఱ, పాప, బుడుత, చిరుత, పట్టి.. అనునవి; అచ్చ తెలుగు పదాలు!
⚜️ కంద పద్యములు 
   ఆకలి దప్పుల నెన్నుచు
    ప్రాకటముగ నెదుగు నట్లు
బాల్యమునంతన్
    సాకెడు తల్లి ఋణమ్మును
     ఏకరణిని తీర్చ గలుగ నెవరికి వశమౌ!  (1)
     బుడిబుడి నడకల జాడల
     వడి బాల్యపు సిరుల నెన్న పలువిధములుగా
  
    నెడదను కరిగించును గన
     తడబడుటలు లేని వయసు తలపగ ముదమౌ! (2)
( రచన: డా. శాస్త్రుల రఘుపతి )

కామెంట్‌లు