వెన్నెల; - ప్రభాకర్ రావు గుండవరం--ఫోన్ నం.9949267638
వెన్నెల చల్లని వెన్నెలా
చక్కని వెన్నెలా
చల్లని గాలితో సరసాలాడుతూ
పున్నమి రాతిరి పూచిన వెన్నెలా!!!!!వెన్నెల!!

పసిపాప నవ్వులో పూచిన వెన్నెల
అందమైన చిన్న దాని చిరునవ్వే వెన్నెల
మనసు పడిన మగవానికి మగువే కద వెన్నెల
ఆ మగువకు ఆ మగవాడే అందమైన వెన్నెల
    !! వెన్నెల చల్లని వెన్నెల!!

చిమ్మని చీకటిలో చిరు దీపమె వెన్నెల
ఒంటరి బతుకుల్లో స్నేహమే సిరి వెన్నెల
అమ్మా నాన్నలకు పిల్లలు కదా వెన్నెల
ఆ పిల్లలకు తలిదండ్రులే అసలైన వెన్నెలా
!!  వెన్నెలా చల్లని వెన్నెలా!!

అజ్ఞానము అనే చీకటికి జ్ఞానమే వెన్నెల
ఆపదలో ధైర్యమే మనిషికి వెన్నెల 
పరిమళించే పుష్పాలకు మకరందమే వెన్నెల
మానవత్వం తో వెలిగే మనిషే కద వెన్నెల
  !! వెన్నెలా చల్లని వెన్నెలా!!

కామెంట్‌లు