ఎంతతీయని రోజులు
అవి ఎంత చక్కని రోజులు
తలుచుకుంటేనే మనసు గుండె
పొంగి పోవు కద మిత్రమా
మళ్ళి వచ్చిన బాగుండు నేమో
మనము చదివిన రోజులు
పుస్తకాలు చేతబట్టి కాలేజీకి
వెళ్లిన రోజులు
ఒకే రూములో ఉంటూ మనము
ఒకే కంచములో తింటూ మనము
ఎంత హాయిగా గడిపినామో
ఆ రోజులు మళ్ళీ వచ్చున నేస్తమా
ఒకరోజు ఒకరము వంట చేస్తూ
వంట రుచుల పసందు జేస్తూ
ఆటలాడుతూ పాట పాడుతూ
అల్లరేంతో చేసే వాళ్ళము
ఇంటి ఓనరు రాక జూసి
వినయముగా ఉండే వాళ్ళము
విద్యార్థుల ఎలక్షన్స్ వస్తే
జట్లు జట్లుగా కలిసి పోతూ
రూము రూముకు తిరిగి మనము
ఎంత క్యాన్వాస్ చేసే వాళ్ళమో
మరపురాని రోజులు మళ్ళీ వచ్చునా నేస్తమా
ఎన్ఎస్ఎస్ క్యాంపుకంటూ
రోడ్లు పొసే నెపముతో
పక్క ఊళ్ళోకి వెళ్లి మనము
ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళమొ
పండుగలు వస్తే చాలు
ఎవరి ఊరికి వారు పోయి
అప్పాలు పచ్చళ్ళు తెచ్చి
అందరం కలిసి తినేవాళ్ళము
ఆ రోజులంతో ఆత్మీయమైనవి
మళ్ళీ మళ్ళీ రావాలి నేస్తమా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి