లోకం తీరు; -ప్రభాకర్ రావు గుండవరం--ఫోన్ నం.9949267638

మంచి చెబితే మాకు తెలుసులే అంటారు
చెప్పకపోతే చెప్పాలి కదా అంటారు

మౌనంగా ఉంటే మాటలు రావు అంటారు
మాట్లాడితే వదరు బోతు అంటారు

తప్పును నీలదీస్తే  వాదించకు అంటారు
లేకపోతె  చిన్న చూపు చూస్తారు

ఫలాన దగ్గర ప్రమాదం జరిగిందని ఫోన్ చేస్తే
పోలీస్ స్టేషన్ చుట్టూ తింపుతారు

మనకెందుకులే అని ఊరుకుంటే
మానవత్వం లేని మనిషి అంటారు

అనుభవంతో చెబుతున్నామని చెబితే
వయసు ఉడిగిన వృద్దులు అంటారు

ఏమైనా కాని వారికే తెలిసి వస్తూంది అనుకుంటే
 పెద్దలు ఆ మాత్రం చెప్పగుడదా అంటారు

ఇదేనా లోకం తీరూ

కామెంట్‌లు