కొండ పక్కన మా ఊరు
అందమైన పల్లెటూరు
మా ఊళ్ళో జనమంతా
మమతల మాణిక్యాలు
మా ఊరంటే మాకు ఇష్టము
మామిడి తోటలో ఆడేస్తాం
వాగు పక్కన ఇసుకల్లో
చెలిమలు మేము తోడేస్తాం
పిచ్చుక గూళ్లు కట్టేస్తాం
ఆడుతూ పాడుతూ గడిపేస్తాం
ఎండాకాలం ఎంతో హాయి
తోటలో కెళ్ళి ఆడేస్తాం
బావుల చుట్టూ తిరిగి మేము
ఈతలు బాగా కొట్టేస్తాం
సాయంకాలం షికార్లు కొడుతూ
పొలాల పొంటి తిరగేస్తాం
మంచెలు ఎక్కి పక్షులనన్ని
గులేరు తోని కొట్టేస్తాం
వీధి వీధి తిరుగుతూ మేము
గోటీలు చక్కగా ఆడేస్తాం
గెలిచినవన్నీ కోమటికిచ్చి
పిప్పరమెంట్లు తినేస్తాం
పొద్దుపొయాక ఇంటికెళ్లి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి