మేమూ పిల్లలం;---గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,సెల్:9966414580.
పిల్లలం పిల్లలం
పరమ తండ్రి  పుత్రులం
అందరికీ మిత్రులం
ఆనంద జీవులం

శుద్ధమైన బాలలం
బుద్ధిలోన శ్రేష్ఠులం
ముద్దుముద్దు పూవులం
ముద్దులొలుకు నగవులం

చిలుకమ్మ పలుకులం
చిగురాకు సొగసులం
చిన్నిచిన్ని పిల్లలం
చింత లేని మనసులం

ఆకసాన చుక్కలం
అందాల మొక్కలం
అపరంజి మొలకలం
అరవిరిచిన మొగ్గలం


కామెంట్‌లు