" చురకలు ";---గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,సెల్:9966414580.
మంచి చేసే వారు
అందాల సెలయేరు
దీవెనలు దరిచేరు
ఓ వెన్నెలమ్మ

మానవత్వం మేలు
కల్గియుంటే చాలు
దానవత్వం తేలు
ఓ వెన్నెలమ్మ

తల్లిదండ్రుల గోడు
తాకె నింగిని చూడు
లేదు బాధ్యత నేడు
ఓ వెన్నెలమ్మ

ఆశ్రమాలు వెలిసెను
వృద్ధులతో నిండెను
ప్రేమ ధార ఎండెను
ఓ వెన్నెలమ్మ


కామెంట్‌లు