సుభాషితాలు;---గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,సెల్:9966414580.
కష్టానికి ఫలితము
ఉంటుంది ఖచ్చితము
తొలుత శ్రమిస్తే ఇక
సుఖమయం జీవితము

విలువైన అక్షరము
బలమైన ఆయుధము
నమ్ముకుంటే దానిని
భవితే! వెలుగుమయము

గురువుల సహవాసము
బ్రతుకున మధుమాసము
వెల్లువై పొంగిపొర్లు
మనసున ఆనందము

రైతన్నల క్షేమము
దేశానికి భాగ్యము
వారు చల్లగుంటే
వర్ధిల్లును దేశము


కామెంట్‌లు