మెచ్చినా... నొచ్చుకున్నా... !!-- కోరాడ నరసింహా రావు

 మమేకం... తాదాత్మ్యమే యోగం !
  యోగమంటే... కలయికలో పారవశ్యం... !
ఆ పారవశ్యాన్ని  కలిగించే గొప్ప  సహజ సాధనం సంగీతం  
మనసుకు ప్రశాంతతను కలిగిం చేది,ఆరోగ్యాన్ని పొందించేది... 
సుఖ, సంతోషానందాలను అం దించేది... గాత్ర, జంత్రవాద్య సప్త స్వర సంగీతం... !
అందుకే..సంగీతానికి  శిశువు లు,పశువులే కాదు, పాములూ
పరవశించి తలలూపేది... !!
భక్తి సంగీత సాధనతో ముక్తి మార్గాన్ని...త్యాగయ,రామదాసు,అన్నమయ్య లాంటివారెం దరు లేరు...!
మన జీవితమే... లయబద్ద మై న  అనేకానేక రాగాల సంగీత సాధన !!
పరిశోధనాత్మకంగా పరిశీలిస్తే... 
ఈ ప్రపంచ సమాజ వేదికపై....
ప్రతి ప్రాణీ తన కచేరీని ప్రదర్శించి,పరవశిస్తూ, సమాజ ప్రేక్షకులను పరవశింపజేసి.... 
కచేరీ ముగియ గానే ఈ వేదిక దిగి,మరలి పోయే వారే.... పదుగురికీ నచ్చినా,నచ్చకున్నా
మెచ్చినా... నొచ్చుకున్నా !!
     ******
కామెంట్‌లు