నేరాలు ఘోరాలు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 అనుభవానికి 
ఆదరణ, 
అవగాహనకు 
ఆచరణ తగ్గినప్పుడు...
మాయ మాటలు,
మోసాలే, మీసాలు 
తిప్పి రాజ్యాలు 
ఏలినప్పుడు....
సరససల్లాపాల 
స్వామీజీల
సలహాలే 
విలువైనప్పుడు....
స్వార్ధపరులే 
నాయకులుగా
నిలిచి గెలిచినప్పుడు....
ప్రజా ప్రతినిధులందరికీ
నీచ రాజకీయాలే
పరువైనప్పుడు....
అసలు 
రాజకీయాలలో 
నీతే కరువైనప్పుడు....
నమ్మలేని నేరాలను
ఘోరాలను చూడక
తప్పదుగా మరి!!!!


కామెంట్‌లు