శబ్ద సంస్కృతి... సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 --మధువు అంటే తేనె.నవజాతశిశువుకి తేనెనాకించటంని మధుప్రాసన అంటారు.మధుపర్కం అంటే తేనె పెరుగు నీరు నెయ్యి చక్కెర కలిపి దేవునికి నైవేద్యం పెడతారు.శివాభిషేకం ఇలాగే చేస్తాం.
 --మదాలస అంటే మందంతో పూర్ణంగా ఉన్న అని శబ్దార్ధం.మార్కండేయపురాణంలోవిశ్వావసు అనే గంధర్వుని కూతురు మదాలస.వజ్రకేతుని కొడుకు ఆమె ను కిడ్నాప్ చేసి పాతాళ లోకంలో దాచాడు.పాతాళకేతునిచంపిఋతుధ్వజుడు మదాలసను పెళ్లాడాడు.అతని శత్రువులు భర్త మరణించాడు అని దుష్ప్రచారం చేయటంతో మదాలస శ్లోకంతో చనిపోతుంది.ఋతుధ్వజుడు భార్య తనకోసం విలపించి చనిపోయింది అని బాధ పడుతున్న అతనికి నాగరాజు మదాలస లాగానే ఉన్న ఇంకో కొన్ని సృష్టించి ఋతుధ్వజుని శోకం తీర్చాడు.మదాలససౌందర్యానికి ప్రతీక.అందుకే ఆపేరు కుమార్తెలకుపెడ్తారు
---మర్కట్అనే హిందీ తెలుగు పదంకి అర్ధం కోతి అని.మరాఠీ లో మాకడ్ గా మారింది.ఇది ద్రవిడభాషనుంచి వచ్చింది అని అంటారు.మర్ అంటే మొక్క చెట్టు.మర్కటంఅంటే చెట్టుపై ఉండేది.వనంలో ఉంటుంది కనుక వానరం.
మనోనీతి అంటే మనసులో కలిగిన భావం మనసుకు ఇష్టమైన అనే అర్ధాలు ఉన్నాయి.కానీ హిందీ లో నియమించుట నామినేటెడ్ అనే అర్థంలో వాడుతున్నాం.మనకు ఇష్టం ఐనవారినే నియమిస్తాముకదా!🌺
కామెంట్‌లు