ఆ ఊయల
ఊగుతూనే వుంది...
సాయంసంధ్యలలో
ఆరుబయట పంచలో
అదే పనిగా ఆ ఊయల
ఊగుతూనే వుంది...
సంతోషాల
సంబరాలను చూసింది...
భాధ్యతల
బంధాలను కాసింది...
కలతల
కన్నీళ్ళు తుడిచింది...
అవమానాల
గుణపాఠాలు,
అనుభవాల
పాఠాలు మోసింది...
కానీ ఎందుకో ఈ రోజు
ఆ ఊయల చలనం లేక
ఆగిపోయింది...
మౌనంగా మిగిలిపోయింది...
కన్నీటిలా మారిపోయింది...
తారలా నేలకు రాలిపోయింది...
ఎందుకంటారా???
రెక్కల చాటున దాచి
కంటి రెప్పలా కాపాడుకున్న
తన పిల్ల పక్షులు రివ్వున నింగికి ఎగిరి
గూటికి తిరిగి రావన్న బరువైన మాటలను
ఎద మోయలేక ఉరి పోసుకున్న ఊయల
ఊపిరి భారాన్ని వదిలేసింది...
ఊగుతూనే వుంది...
సాయంసంధ్యలలో
ఆరుబయట పంచలో
అదే పనిగా ఆ ఊయల
ఊగుతూనే వుంది...
సంతోషాల
సంబరాలను చూసింది...
భాధ్యతల
బంధాలను కాసింది...
కలతల
కన్నీళ్ళు తుడిచింది...
అవమానాల
గుణపాఠాలు,
అనుభవాల
పాఠాలు మోసింది...
కానీ ఎందుకో ఈ రోజు
ఆ ఊయల చలనం లేక
ఆగిపోయింది...
మౌనంగా మిగిలిపోయింది...
కన్నీటిలా మారిపోయింది...
తారలా నేలకు రాలిపోయింది...
ఎందుకంటారా???
రెక్కల చాటున దాచి
కంటి రెప్పలా కాపాడుకున్న
తన పిల్ల పక్షులు రివ్వున నింగికి ఎగిరి
గూటికి తిరిగి రావన్న బరువైన మాటలను
ఎద మోయలేక ఉరి పోసుకున్న ఊయల
ఊపిరి భారాన్ని వదిలేసింది...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి