సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 కళ్ళూ...వేళ్ళూ...
*******
మన చుట్టూ ఉన్న సమాజంలో  మనల్ని నిశితంగా పరిశీలించే కళ్ళు, ప్రశంసా పూర్వకంగా చూసే కళ్ళు, కసిగా చూస్తూ ఈర్ష్య పడే కళ్ళు.. ఇలా రకరకాల చూపుల కళ్ళు ఉంటాయి.
ఆ కళ్ళను చూసి అతిగా ఆనందించడమో, భయంతో వెనుకడుగు వేయడమో చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరలేం.
అలాగే.. వేళ్ళలో  బెదిరించే వేళ్ళు, అదరగొట్టే వేళ్ళు, కన్నీళ్ళు తుడిచే వేళ్ళు, మెచ్చుకోలుగా భుజం తట్టే వేళ్ళూ ఉంటాయి.

కళ్ళు భావప్రసార లోగిళ్ళు. వేళ్ళు భావ వినిమయానికి ద్వారాలు.
 ఇవే మన చర్య,ప్రతిచర్యలను వ్యక్తం చేసేవి.
మనం పయనించే దారిలో కళ్ళూ, వేళ్ళూ మానసిక స్థితిని, గమ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి.
అందుకే వేటికీ అతిగా స్పందించకుండా , వాటన్నింటికీ అతీతంగా, మౌనంగా సాగిపోతేనే మనం అనుకున్న లక్ష్యాన్ని ఆనందంగా చేరుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏కామెంట్‌లు