మురికి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం పుస్తకాలు చదివి విషయపరిజ్ఞానం కలిగి ఉంటాము.కానీ దాని లోతుపాతులు అంతరార్ధం తెలుసు కోవాలి. దీన్ని ఇప్పుడు థియరీ ప్రాక్టికల్స్ అంటున్నాము.కప్ప బల్లి ని చూస్తాం. కానీ దానికి ఎన్ని కాళ్ళు  ఏంతింటుంది చదివి నేరుస్తాం.వాటిని చూస్తేనే పుస్తకం లో లేని విషయాలు గ్రహించగలం!మరిఆసాధువు శిష్యులగూర్చి తెలుసు కుందామా? ఆసాధువు దగ్గర  ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఆయన ఎక్కువ మాట్లాడేవాడుకాదు.శిష్యులే అంతా తెలుసు కోవాలి. మంచి చెడు గ్రహించాలి.ఒక రోజు ఆశ్రమంలోకి మంచి నీరు తేవాలని వెళ్లారు చెరో కుండతో ఆశిష్యులు! అటునించే ఎద్దుబళ్లు పశువులు పోవటంతో దారంతా మురికి గా ఉంది. ఆచెరువు పరిసరాలు  కూడా మురికి గా ఉన్నాయి. పశువులు నీరుతాగిన ఆనవాలు కూడా ఉంది. ఆమురికి మడ్డినీరు తేకుండా ఖాళీ కుండలతో వచ్చారు."గురూగారూ!అంతా బురద మురికి చుట్టూ ఉంది. అందుకే చెరువుదగ్గరకు వెళ్లినా నీరు తేలేదు.""ఓ గంటాగి వెళ్లండి".కానీ నాలుగు సార్లు ఓపికగా వెళ్లినా నీరు శుభ్రంగా లేక పోటంతో ఖాళీ కుండలతో తిరిగి వచ్చారు.ఐదోసారి నీరు అద్దంలా స్వచ్ఛంగా మెరుస్తుంటే అప్పుడు కుండల్లో నీరు పట్టి తెచ్చారు. గురువు గారు ఇలా అన్నారు"అబ్బాయిలూ!మనజీవితం కూడా నీరు లాంటిదే! భావాలు ఆలోచనలు అనే ఎద్దుబళ్లు పసులు మన బుర్రలో అలా తిరుగుతూ ఉంటాయి. మనసుని మురికి చేస్తాయి.సమస్యలు వస్తే పారిపోకుండా మనసు ని ప్రశాంత సరోవరంలా ఉంచాలి. మంచి భావాలు కలిగేలా సాధనచేయాలి. నాల్గు సార్లు నీరు నింపటానికి పోవటమే సాధన! మురికి ఆలోచనలు పోవటమే అసలుసిసలు విద్య."ఇక ఇప్పుడు మన అందరికీ  పోస్ట్ డబ్బా తెలుసు. కానీ కార్డు కవరు స్టాంపు తెలీదు. టెన్త్ పిల్లలకు  కూడా తెలీదు. స్వానుభవం తో తెలుసు కున్నాను.వారి ఇంటిపేరు కూడా చెప్పలేరు.కానీ మార్కులు 90పైనే!అది అమ్మా నాన్నలలోపం!అందుకే ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం.బడిపిల్లలకి పోస్ట్ ఆఫీసు  కరెంటు బిల్లు ఆఫీసు  ఇంటి అడ్రసు అన్నిచూపాలి చెప్పాలి.ఇది అసలువిద్య!అజ్ఞానపు మురికి పోవాలి.ఆధ్యాత్మికంగా ఐతే దేవుడి పూజ శ్లోకాలు నేర్చుకోవాలి.🌹
కామెంట్‌లు