నీవె ఆదర్శమవ్వాలి.... ! *.కోరాడ నరసింహారావు
 నేర్చినది  ఏదైన... విద్యయే బాలకా... !
 కోటివిద్యలున్నవికూటికోసమే!
విద్యలన్నియు,తమ తమపొట్ట  లు నింపుకొనుటకు కాగా అంద రి ఆకలినీ దీర్చే... వ్యవసాయ విద్యాకన్నా గొప్పవిద్య ఇంకే మున్నది  బాలకా.... !?
 
యే విద్యలోనైననైపుణ్యమును  బొంది ఖ్యాతిని గడించుట  ముదావహమే,....ఐననూ.....
చదువు లేకున్న...  లేదు  ఇల 
గౌరవము !
నిరక్షర కుక్షి యని హేల నే...
చేయు దురు !!
ప్రాధమికముగ నీవు చదువుకో 
వలెను...., 
చదువుతో పాటుగా...యేవిద్య 
నేర్చినా.. గౌరవమర్యాదలనంది  జీవితముననీవు......సుఖించ
గలవు !!
ఈ వయసునుండియే నీ ఈ  వ్యవసాయాభిలాష.... మంచి రైతుగ గొప్ప పేరుతెచ్చునులే ! చదువుతో పాటు ... మంచి రైతువై నీవు...  అన్న దాతగ ...ఖ్యాతి గడియించ వోయి...!!
కన్నవారికి, మన దేశానికీ... 
గొప్ప  పేరునేదెచ్చి  ...,
   ఎందరికొ  నీవే... ఆదర్మ 
మవ్వాలి ... !!
     ******

కామెంట్‌లు