గజల్జ్;-నెల్లుట్ల సునీత- కలం పేరు శ్రీరామ
ఫాదర్స్ డే శుభాకాంక్షలతో
===================
ఏ సిరులకు సరితూగని ప్రేమధనం నాన్న మనసు
ఇలలోన దైవమంటే కరుణదనం నాన్న మనసు

తన బిడ్డల క్షేమాన్ని కాంక్షించును నాన్నేపుడు
తేనేకంటే తీయనైన కమ్మదనం నాన్న మనసు

అవధిలేని హాయినిచ్చే వరముకదా నాన్నంటే
త్యాగాల్లో నెలవైన గొప్పదనం నాన్న మనసు


జీవితమే పోరాటం చేసుకుంటూ సాగిపోతు
   గుండెనిండ  ధైర్యానికి మెండుదనం   నాన్న మనసు

ద్వేషించిన మనమంచికి మార్గమవ్వు  ప్రేమమూర్తి
వెన్నవలె మృదువైన మెత్తదనం నాన్నమనసు

ఎవరికైనా సాటిరాని ప్రేమపంచి మురిపించును
కరుణకేమి వెలితిలేని నిండుదనం నాన్నమనసు

జీవితాన వేలుపట్టి నడిపించిన స్నేహితుడై
రాజమార్గ  మెంచుకొనగ ఆదర్శదనం నాన్నమనసు

మంచి పనికి వెన్నుతట్టి ప్రోత్సహించే ప్రేరణనవుతు
ఆదర్శమై ఎదగమనే మూలధనం నాన్న మనసు

నాన్న ముందు స్వర్గమైన దిగదుడుపే ఎవరికైనా
నిండుగాను కొలువైన దైవదనం నాన్న మనసు

విలువలకే చిరునామా వీలునామ వ్రాసిఇస్తూ
సునిభవితకు బాటలేసె వెలుగు దనం నాన్నమనసు.


కామెంట్‌లు