సుప్రభాత కవిత ;-బృంద
కిరణాల ప్రవాహం
పుడమికంతా సమానం.

దినకరుడి అనుగ్రహం
ప్రకృతి  కంతటికీ  శోభస్కరం.

మబ్బుల నింపే నదుల నీళ్ళు
నీటిని వర్షించే మొయిళ్ళ గుంపులు.

మబ్బుల మాటున మెరిసే
మెరుపులు
పువ్వుల  నవ్వుల చేరాయి.

విరిసిన పువ్వుల కాంతులు
బంగరు వెలుగున మురిసాయి.

ఒకదాని  వృద్ధి  ఒకదానిపై
అధారపడి   నడుస్తోంది సృష్టి  సర్వం

దేని ప్రాశస్త్యం  దానిదే
దేని ప్రత్యేకత దానిదే

అందరిలో ఉండాలి
అందరి వారిగా వుండాలి

అదే సృష్టి  ధర్మం.
పరస్పర  సహకారం.

పడ్డవాడికి చేయందించడం
లేనివాడికి ఉన్నదాంట్లో సాయం చేయడం.

ఇవ్వడంలో ఆనందం తెలుసుకుంటే
జీవనం మధురంగా తోస్తుంది.

మధురమైన ఉదయాన్ని
మనసారా స్వాగతిస్తూ

🌺🌺 సుప్రభాతం 🌺🌺


కామెంట్‌లు