ఆనాటి శాస్త్రవేత్తలు! సేకరణ ;-అచ్యుతుని రాజ్యశ్రీ

 బెంజమిన్ ఫ్రాంక్లిన్ కి న్యూయార్క్ లో ఎక్కడా ఉద్యోగం దొరికలేదు.కీమర్ అనే ముద్రణాసంస్థ నించి  నిరాశతో తిరిగివస్తుండగా ప్రెస్ యజమాని పిల్చాడు. "నాహ్యాండ్ ప్రెస్ పాడైంది.బాగు చేస్తావా?" "చేస్తాను.కానీ నాకు ఆపని రోజంతా పడుతుంది. " "రోజు కూలీ ఇస్తాను"అనటంతో మధ్యాహ్నం కల్లా దాన్ని మరమ్మత్తు చేశాడు బెంజమిన్. ప్రెస్ యజమాని  ఆరోజు కూలీమొత్తం ఇవ్వబోతే "నేను సగంరోజే పనిచేశాను కాబట్టి  నాకు సగంకూలీ చాలు " అన్నాడు. 
తన అన్న తో విసిగిపోయిన  బెంజమిన్ తన 17వ ఏట బోస్టన్ నించి న్యూయార్క్ వెళ్లాడు. ఫిలడల్ఫియాలో ప్రెస్ లో ఉద్యోగం దొరికింది. వదినె లేఖ రాసింది "బాబూ!మీఅమ్మ నాన్న దిగులు పడుతున్నారు. ఇంటికి తిరిగి రా!"  అతని జవాబు ఇది"నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకు తున్నాను.కష్ట పడతాను.తక్కువ ఖర్చు చేస్తాను. మత్తు పదార్ధాలకి దూరం గా ఉంటాను.నీతి నిజాయితీ కి నిలబడతా!గెలుపు నాదే!"
తక్కువ దుస్తులతో బాగా చలిగా ఉన్నాసరే 10నిముషాలు చల్లనిగాలి లో తిరిగేవాడు.అలా శరీరం ని రాటుచేశాడు.రాత్రి నాలుగు పరుపులపై పడుకునే వాడు. శరీరం వేడెక్కగానే ఆపరుపు వదిలి రెండో పరుపు పై వాలేవాడు.ఇలాతెల్లార్లూ  పరుపులు మార్చుతూ కాలక్షేపం చేసేవాడు.
జర్మనీకి చెందిన నోబెల్ బహుమతి విజేత బర్నర్ వాజన్ బర్గ్ 19వ ఏట ఓబడిలో సెంట్రీ డ్యూటీ చేసేవాడు. అప్పుడే ప్లాటో రాసిన "థిమైస్"అనే పుస్తకం దొరికింది. దాన్ని రోజు చదువుతూ స్వయంకృషితో 23వ ఏట ఓ ప్రొఫెసర్ దగ్గర చేరాడు.24-26వ వయస్సు లో ప్రొఫెసర్ చేరి 32వ ఏట నోబెల్ బహుమతి పొందాడు.ఓ సెంట్రీ కుర్రాడు 13ఏళ్ళ కృషి తో నోబెల్ విజేత!!కృషి  పట్టుదల  అదృష్టం  ఆనాటి  శాస్త్రవేత్తల జీవితాలు 🌷
కామెంట్‌లు