రథసారథి దాశరథి
బిడ్డల నరకయాతన చూసి తల్లడిల్లుతున్న తల్లిని ఉరడించగా
పద్యమై పలికెను ప్రజాకవి తెలంగాణము సంకెళ్లు తెంచగా...
తడిసిన నెత్తుటి గాయాల పాదాలతో, అలసిన
అభాగ్యుల ఆకలి కేకలు కవలించగా కదిలెను కవి
కలం పట్టి కవిత్వం అన్న కొరడాను ఝళిపించగా...
రాచరికపు పరిపాలన గావించిన, రజాకార్ల తలకెక్కిన పొగరుని
తలదించగా గర్జించెను కవి గళమెత్తి సరికొత్తగా.... అసాంఘిక పరమైన అరాచకాలను అంతమొందించగా
తన అక్షరాలను అగ్గిగా మలచెను అభ్యుదయ కవి దొరల
దాష్టికానికి నిప్పు పెట్టగా... విడుదల కోరి, పోరాడి అమర వీరులెందరో తమ అసువులను
అర్పించగా నిరసించిన విప్లవ కవి నినదించెను నిశి నీడలో నవ వేకువను కాంక్షించగా...
సాగలేక సంకల్పం సన్నగిల్లగా, పదునైన పదజాలంతో
పరుగులు పెట్టించెను కవి, సమరానికి సాహిత్య చురకలను అంటించగా... స్వరమును ధిక్కరించెనని
చెరలోన పెట్టగా ఏగెఁను దాశరథి చరిత్రలో దొరలను ముసలి నక్కలన్న ఘనత దక్కగా...
కోరుకున్న స్వరాజ్యంలో స్వేచ్ఛగా విహరించగా చిత్రసీమలో
పాదం మోపెను మధుర కవి మాటలను పాటలుగా మలచి సుస్వరాల సరిగమలను పలికించగా...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి