పద్యాలు ; జి.లింగేశ్వర శర్మ-సిద్దిపేట
1.భోలాతత్వముతోడను
నీలీలలుజూపగలవునిరతమ్ముమహా
కాలేశ్వరుడా!దేవా!
శూలాయుధకరసురేశ జ్యోతిర్లింగా!

2.లీలనుజూపుచుధర శ్రీ
శైలంబందువెలసితివిశంకర! నీవే
హాలాహలమునుదాల్చిన
శూలాయుధనీలకంఠ జ్యోతిర్లింగా!

3.శిరమునగంగనుదాల్చియు
కరమునశూలమునిడుకొనికైలాసపతీ!
సరగునభక్తులగావుము
సురగణవందితసురేశ జ్యోతిర్లింగా!


కామెంట్‌లు