నగేష్ కంప్యూటర్: చిన్నూ-ఉడుత;-డా:కందేపి రాణి ప్రసాద్
ఆదోక మూడంతస్తుల మేడ మూడో అంతస్తాని పేరే గాని అక్కడోక రేకుల షెడ్డు మాత్రమే ఉంటుంది. అందులో వాళ్ళ పాత సామాన్లు పెట్టుకునేవారు.ఇ మధ్యనే వాచ్ మెన్ కుటుంబానికి ఇచ్చారు.వాచ్ మెన్ కు ఇద్దరు పిల్లలున్నారు. చిన్నవాళ్ళు ఏడేళ్ల కొడుకు నాలుగేళ్ళ కూతురు ఉన్నారు.

ఆచిన్న రేకుల షెడ్డు తప్పించి మిగతా అంత ఖాళీనే
 పిల్లలిద్దరూ ఆ ఖాళీ ప్రదేశమంత చక్కగా ఆడుకుంటారు.కింద నుంచి పొడవుగా పెరిగిన కొబ్బరి చెట్లు ప్రహరీ గోడను తాకుతూ ఉంటాయి.
అన్నా చెల్లెళ్లు ఇద్దరూ కొబ్బరి బూరలు చేసుకొని  ఉదుకుంటారు.కొబ్బరి ఆకులతో వాచీలు ఉంగరాలు తయారుచేసి చేతికి పెట్టుకొని మురిసి పోతారు.ఆఖాళీలో దొంగ పోలీస్ తొక్కుడు బిళ్ళ లాంటి ఎన్నో ఆటలు ఆడుకుంటారు.అంత పెద్ద సిటీలో  వాళ్లకు ఇలాంటి వాతావరణం దొరకడం అదృష్టం. అంత పెద్ద భావంతిలో ఉండే ఓనర్ల పిల్లలకు ఇటువంటి అవకాశమే లేదు.అఇంటికి వాచ్ మెన్ గా పనిచేసే పిల్లలకు ఎంత అదృష్టమో

బుజ్జి పిల్లలకు తోడుగా పెద్ద ప్రాంగణం ,కొబ్బరి చెట్లు మాత్రమే కాదు.చెట్టు మీద వాళే 
కాకులు,పిచ్చుకలు,ఉడుతాలు ఎన్నో వచ్చిపిల్లలతోను స్నేహం చేసేవి.అందులో ఒక ఉడుత దైర్యంగా కిందకు దిగి పిల్లల దగ్గరకు వచ్చేది.పిల్లలు వాళ్ళు తినేదేదో పెట్టేవారు.అది తినేది పరిపోయేది కాదు.వాళ్ళతో స్నేహం చేసేది.

పిల్లల స్నేహం చూసి వాళ్ళ తల్లి తండ్రి అన్నం మెతుకులు,మొక్కజొన్న పొత్తులు తెచ్చి ప్రహరీ గోడ మీద పెట్టేవారు. ఉడుత కొబ్బరి చెట్టు నుంచి దిగి వచ్చి ఆవి తిని తోక ఉపేది.పిల్లలు సంబరంగా చప్పట్లు కొట్టేవారు. కిల కిల మని నవ్వేవారు.వాళ్ళ నవ్వులు దానికి ఆనందాన్ని ఇచ్చేవేమో.మాటి మాటికి కొబ్బరి చెట్టు మీద నుంచి ఎక్కడం దిగడం చేసేది.అలా చూస్తూ పిల్లలు నవ్వులు పూయించేవారు.

ఒకరోజు పిల్లలు నిద్రలేచే సరికి అక్కడ చెట్లు లేవు. కిందికి చూస్తే కొట్టేసిన చెట్లను వ్యాన్లలో తీసుకెళుతున్నారు కూలీలు .ఈ ఇల్లు అపార్ట్మెంట్లకు ఇస్తున్నారంట.మనమూ ఖాళీ చేయాలి."తండ్రి దిగులుగా చెప్పాడు.పిల్లల మోహల్లో ఏడుపు దైన్యం కనిపించాయి."ఉడుతా ఎక్కడికి వెళ్లి ఉంటది నాన్న"?అడిగింది చిన్నూ "ఏమోనమ్మ అది కూడా మనలాగే కొత్త ఇల్లు వేటుకొంటోంది. కాబోలు" తండ్రి దిగులుగా చెప్పాడు.అప్పటి నుండి పిల్లల మోహల్లో నవ్వులు కరువయ్యాయి.
[03/10/2021, 12:17 pm] నగేష్ కంప్యూటర్: వివాహ బంధం
               డా" కందేపి రాణి ప్రసాద్

వివాహం పవిత్ర బంధం
వివాహం మధుర ఘట్టం
వివాహం జీవన కావ్యం
వివాహం సుస్వరా గానం 

అమ్మాయికి విద్యాలన్ని నేర్పించి
అధ్యజమైన ప్రేమను పంచి
అపురూపంగా గారంగా పెంచి
అత్త వారింటింకి అంపకం చేయాలి 

అబ్బాయిని చక్కగా చదివించి
అల్లారు ముద్దుగా బుద్దిగా పెంచి
అందమైన అడపిల్లనుతెచ్చి
అనురాగల జంటగా మార్చాలి! 

తలపై జీలకర్ర బెల్లం పెట్టుకొని 
తెరచాటు నుంచి తొంగి చూస్తూ
తాళి కట్టినప్పటి నుంచి ఒక్కటై
తరతరాల వ్యవస్థను నిలపాలి! 

సామరస్యంతో  సర్దుకుపోవాలి
సమన్వయంతో ముందుకు సాగాలి
సంసార రథాన్ని సరిగా నడపాలి
సర్వదా సుఖంగా జీవించాలి

కామెంట్‌లు