ఇష్టపదులు ;- ఎం. వి. ఉమాదేవి
భారతీయుల బలిమి భద్రముగ నిలిచినది 
యోగసాధన తోడ యోచనాధ్యాత్మిము 

ఆదిలోనే దెలిపె నాతండు యోగమును 
పతంజలి యనుపేర పరమ యోగీశ్వరుడు 

భావమదుపుని జేయగ భవ్య యోగము హేతువై 
మానవుల సంసార మాయను మహిని దీర్చు 

శారీర మానసిక సత్వమ్ము పెంపొంద 
యోగసాధన లోన యోగించు ఫలితమ్ము 

సాత్వికత రూపొంది సాధుజన శోభితము 
శాకముల భక్షణము శక్తినిల్వల విధము 

అయోధ్య వాసునిగా యానాటి రుజువుండె 
అష్టాంగ యోగమును న ద్భుతము రచియించె 

క్రమబద్ధ కదలికయె క్రమముగా యోగమగు 
శమియించు రోగములు శక్తియును కలిగించు 

చిత్తమున యదుపుంచి చీకాకు తొలగించు 
ధ్యానమొక యోగమ్ము ధన్యవాదము మునికి !

కామెంట్‌లు