సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 పన్నుపోటు... వెన్ను పోటు
  ******
పన్ను పోటు,వెన్నుపోటు ... ఇవి రెండూ మనల్ని మహా ఇబ్బంది పెట్టేవే.
ప్రభుత్వం విధించిన రకరకాల పన్నుల పోటు బడుగు జీవుల పాలిట భారంగానే ఉంటుంది. 
ఇక పన్ను పోటు మొదలైందంటే ఓ పట్టాన తగ్గదు.మనిషిని స్థిమితంగా ఉండనీయక విపరీతమైన బాధ పెడుతుంది.
 ఉపశమనానికి ఎన్ని చిట్కాలను ఉపయోగించినా చివరికి డాక్టర్ దగ్గరకు వెళ్ళేంత వరకు తగ్గదు.
అందుకే  ఈ పన్ను పోటు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక వెన్ను పోటు అనేది మనం బాగా నమ్మిన వాళ్ళు చేసే ద్రోహం.
 మన వెంట ఉంటూనే ఉన్నతిని, పేరును చూసి తట్టుకోలేక ,ఓర్వలేని తనంతో తలపెట్టే కీడు అది.అంతా కోల్పోయిన తర్వాత గానీ వెన్ను పోటు పొడిచారన్న సంగతి తెలియదు.
అందుకే పన్ను పోటు, వెన్ను పోటు విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏కామెంట్‌లు