వందే పతంజలీం! -డాక్టర్ అడిగొప్పుల సదయ్య
మనసులోపల కలుగు మలినముల తొలగింప
అష్టాంగయోగమును ఆనతిచ్చినవాడ!

భాషలోపల పుట్టు దోషముల సవరింప
వ్యాకరణ సూత్రాల భాష్యమిచ్చినవాడ!

తనువుకేర్పడు చెడ్డ తత్త్వమును పోగొట్ట
వైద్యమును ప్రజకునైవేధ్యమిచ్చినవాడ!

ఆదిశేషుని రూప! ఆది వైద్యా! మౌని!
ప్రాంజలిదె కొనుము శ్రీ పతంజలి మహర్షీ!!


"సాహితీ చక్రవర్తి"
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125


కామెంట్‌లు