ఓ నిరుద్యోగ యువతా... ! కోరాడ నరసింహా రావు

 ఓ నిరుద్యోగ యువతా.... 
   ఇదేనా  మీరాశించిన భవిత!
బ్రతకటానికా...మీరుచేసే పోరా టం...చావటానికా... !?
   చట్టాన్ని-శాంతి,భద్రతలను...
దేశాన్ని కాపాడాలనుకునే మీరు 
చెయ్యాల్సిన పనులా ఇవి ?!
సంఖ్యాబలమున్న మీరు విధ్వం
శానికి దిగవచ్చా...., మన ఆస్తు లను మనమే ఇలా తగలబెట్టు కోవచ్చా ... ?!
    ఆ విధ్వంసానికి బదులుగా..
యేఒక్కరూచెదరక..నిరాహారులై...మీ నిరసన తెలిపుంటే.... 
పదుగురు హర్షించును కద...
దిగివచ్చును ప్రభుత్వమే... !
ఆవేశమె గానీ... ఆలోచన చేయరా... !?
 న్యాయమైన హక్కులకు, దౌర్జన్యం చేయనేల...,మీ బ్రతుకులను, మీరే బుగ్గిపాలు చేయనేల... !?
   సమస్య అది ఏదైనా...హింస తో తీరదు...,గాంధీ చూపిన మార్గం...అహింసా, సత్యాగ్రహ మే... శరణ్యం... !
  ఇకనైనామేలుకోండినవయువతా చక్కగా దిద్దుకోండి మీ భవిత !!
     *******
కామెంట్‌లు