బాల గేయం ;-గుండాల నరేంద్రబాబు
పల్లవి: 

 పిల్లలం ఆడ పిల్లలం
ఈ ధరణిలో వెలసిన దేవతలం
పిల్లలం ఆడ పిల్లలం
ఈ ధరణిలో వెలసిన దేవతలం 

చరణం:1

మీ ఇంటికి మేమే వెలుగులం
మీ కంటికి మేమే జిలుగులం
మీ ముంగిట మేమే ముగ్గులం
మీ పందిట మేమే మొగ్గలం

చరణం:2

మీకు జోల పాడేటి నాన్నమ్మలం
మీకు లాల పోసేటి అమ్మమ్మలం
మీకు జన్మ ఇచ్చేటి మీ అమ్మలం
మీకు ప్రేమ పంచేటి అత్తమ్మలం
======================
-గుండాల నరేంద్రబాబు 
తెలుగు పరిశోధకులు 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.
సెల్: 9493235992.


కామెంట్‌లు