కాకి పాట్లు(భోజ్ పురి కథ ఆధారంగా) అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరైతు భార్య గోధుమలు ఎండపెట్టింది.ఎక్కడనించో ఓకాకి వచ్చి కొన్ని గోధుమ గింజలు నోటిలో పెట్టి చెట్టుపైకెక్కి కూచుంది. ఓగింజకాస్తా చెట్టుతొర్రలో పడింది. ఆమె కాకి రెక్కలని ఒడిసిపట్టుకుని"ఏయ్!కాకీ!నాగింజలు నాకు ఇవ్వకుంటే నీపీక పిసుకుతా"అంది."అమ్మా!చంపకు.ఇప్పుడే నీగింజలు తెస్తా"అని"ఓచెట్టూ!నీతొర్రలో గోధుమ గింజలు పడ్డాయి.ఇవ్వవూ?"అని అడిగింది. "ఉహూ!నేనివ్వను" కోపంతో కాకి చెట్టు కొట్టే కూలీతో" ఆచెట్టు ని కొట్టేయి.నాగోధుమగింజలు దాని తొర్రలో పడితే ఇవ్వడం లేదు"అంది."అనవసరంగా చెట్లు నరకను.చల్లటి నీడ ఇస్తుంది. "అన్నాడు. కాకి రాజు దగ్గరికి వెళ్లి "రాజా!కూలీని దండించు.తొర్రలో ఉన్న గోధుమ గింజలు ఇవ్వనంటోంది చెట్టు.కూలీ దాన్ని కొట్టేయను అని అన్నాడు. ""అన్యాయంగా కూలీని శిక్షించను".కోపంతో కాకి రాణీదగ్గర వాలి తన కథంతా చెప్పింది."నీభర్తపై అలుగు." రాణీ నిరాకరించింది.
 అంతే రుసరుసలాడుతూ పాముతో తన సోది అంతాచెప్పిరాణీని కాటేయమంది."అనవసరంగా కాటేసే బుద్ధి నాకు లేదు "పాము  జవాబుతో రెచ్చిపోయిన కాకి ఓకర్రను అభ్యర్ధించింది"పాము ని చితకబాది ఒళ్లు హూనంచేయి"బడితె నవ్వింది "కాకీ! నీకేమైనా పిచ్చా? అనవసరంగా పాము ని ఎందుకు బాదాలి?మేము  మూర్ఖపు మానవులం కాము." ఇక కాకి నిప్పుని బతిమాలి కర్రను కాల్చమంటే అది నిరాకరించింది. ఇలాకాలువ నిప్పుని ఆర్పనిరాకరించింది.
: కాకి ఓగేదెను అడిగింది "ఆకాలువ నీటిని బురద బురద గా చెల్లా చెదురు చేయి" అదినిరాకరిస్తే పలుపుతాడుకి తనకథ చెప్పి "బర్రెను బంధించు"అంది. అది నిరాకరించింది. ఎలుక తో"పటపటా తాడుని కొరుకు"అంది. "ఉహు! అనవసరంగా నానోటి దంతాలు  అరిగిపోటం నాకు ఇష్టం లేదు. " ఇక కాకి కోపం నషాళానికి అంటింది.ఇంతలో  మ్యావ్ మ్యావ్ అంటూ గండుపిల్లి ఎదురైతే తన కథంతా చెప్పి కాకి అంది"ఆఎలుకను గుటకాయస్వాహా చేయి.అందరి పొగరు అణుగుతుంది.అంతే పిల్లినోట్లో నీరూరింది.రెండు రోజుల బట్టి తిండి లేదు. ఎలుక ను పట్టాలని పరుగెత్తింది.అంతే దెబ్బకు దెయ్యం వదిలినట్లు ఎలుక కట్కట్ అంటూ పలుపుతాడు కొరికి తన బొరియలో దూరింది.ఇక భయపడిన  గేదె కాలువ  కర్ర నిప్పు జోరుగా అరిచాయి"ఓకాకీ!నీవు చెప్పిన  పనిచేస్తాం".ఇకరాణి రాజుతో సహా అంతా జీహుజూర్ అన్నారు. కూలీ గొడ్డలి తేగానే చెట్టు గజగజవణుకుతూ తొర్రలోని గింజలు బైట పారేసింది.కాకి ఆగింజలన్నీ ముక్కు తో ఏరి రైతు భార్య కి ఇచ్చింది.ఆమె ఆనందించి రొట్టె ముక్కలు వేసింది కాకికి బహుమతి కింద 🌹
కామెంట్‌లు