* లెండి.......బ్రతుకులు చక్కదిద్దుకొండి * కోరాడ నరసింహా రావు !
 వివిధ అవసరములు 
                       దీర్చికొనగా.. .
పరస్పర సహకారభావము....
చేతివృత్తుల రూపుదాల్చెను !
   
కుమ్మరి,కమ్మరి,చాకలి,మంగలి
ఎన్నెన్నో కులములుగా.......... 
అవి స్థిరపడిపోయినవానాడు!
ఆనాటిపల్లెలలో....
        పంటలుపండించు రైతే...  అందరికీ తగుపాళ్ళుపంచుచూ హెచ్చుతగ్గులను బేధము లేక... కష్టసుఖాలలో అందరొక్కటై..... కలిసీమెలిసిహాయి గ బ్రతికే.... రోజులు పోయి... 
   వస్తు మార్పిడిరూపునుమాపి       
రూపాయి పుట్టుకొచ్చె....                    
       హెచ్చు - తగ్గు  లెన్నొతెచ్చె 
మనిషిబ్రతుకులోయంత్రములే వచ్చిచేరగా.... . 
   చేతివృత్తులుచితికిపోయినవి
కులాలపేరుతోకష్టాలెన్నో....
        పడిరి చాన్నాళ్లే అగచాట్లు
మారిన రోజులతో పాటు       
          మనమూ  మారకున్న 
                 మనుగడ సున్న !  ఇంకా కులాలు పట్టుకు వేలాడే ఓ దౌర్భాగ్యులారా.... ! 
               ఆ రోజు  లెపుడో....    
.                    అంతరించినవి !
అందరికీ అవకాశములు.... 
  చదువులు, ఉద్యోగములు !
నిజానికిప్పుడు ఉన్నవి  రెండే 
అవికేవలము...కలిమి - లేమిలే
యే కులమైనా... 
   యేమతమైనా,వారెవరైనా...
దీక్షా పట్టుదల లుంటే...                                  
    ఆశించి అనకున్నది సాధించే      అవకాశం  అందరికీఉన్నదినేడు 
చేతివృత్తులను పట్టుకు వేలాడే పనిలేదిప్పుడు  !        
          కుల,మత,వర్గ ప్రసక్తియె లేక,కోరిన రీతిగ బ్రతకొచ్చు...! 
                 లెండి... కదలండి... మీ - మీ బ్రతుకులు... చక్కగా దిద్దుకొండి !
      *******

కామెంట్‌లు