మేలుకో శ్రీ రంగ నందగోపాలా
మేటిగా మా రంగ మువ్వగోపాలా !
చల్లనౌ చందనము చాల తీసేము
వంతుగా నీమేను పూయ గోపాలా !
కస్తూరి తిలకమ్ము కనుబొమల మధ్య
ఇష్టముగ దిద్దేము వేణుగోపాలా !
పట్టు పీతాంబరము దిట్టముగ గట్టీ
యిట్టె రావయ్య మము బ్రోవ గోపాలా !
ముత్యాల సరములు కలువపూ దండ
ముచ్చటగ వేసేము మహిత గోపాలా !
గుమ్మపాలను కడవ గుత్తయిన వెన్న
గుర్తుగా తెచ్చేము గిరిధరగోపాలా !
పలువన్నె పింఛములు మణికిరీటమునా
పట్టుకొని శ్రీ చక్ర మిదే గోపాలా !
శంకలను తీర్చేటి శంఖు వొక చేత
దట్టీలో వేణువు దయను గోపాలా !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి