హరివిల్లు (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పూలతోటలో పువ్వులము 
రంగురంగుల రంగులము
సుకుమారులం సుందరులం
మల్లె మొల్ల మంకెన 
కలువ కమలం కాంచన 
మొగిలి మోదుగ మందార
గునుగు గోరెంక గన్నేరు 
కట్ల సంపెంగ చల్లగుత్తి 
పొగడ పారిజాతం పట్టుకుచ్చులు
బంతి చేమంతి గులాబి
నందివర్ధనం పొన్న పున్నాగ
ఏ పేరైతే ఏమమ్మా
మేమంతా ఒకటేనమ్మా
వర్ణభేదాలు మాకులేనివి
మేమంతా కలిసీ ఈ తోటను
హరివిల్లుగ మార్చేస్తాము !!

కామెంట్‌లు