బాలల రాజ్యం (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చిట్టితండ్రే మారాజు 
చిట్టితల్లే మారాణి 
మారాజ్యం బాలల రాజ్యం 
కల్లాకపటం ఎరుగని రాజ్యం 
కులమతాల కుళ్ళేలేదు
ధనిక పేదా తేడాలేదు 
కోపాల్ తాపాల్ శాపాల్ లేవు 
పంతం ఏడ్పులు అలకలు లేవు
ఆటలు పాటలు నాట్యాలున్నవి ఆనందాల పరుగులు ఉన్నవి 
శాంతీ సహనపు అడుగులు ఉన్నవి 
ప్రేమ అహింసల జాడలు ఉన్నవి మారాజ్యం బాలల రాజ్యం 
కల్లాకపటం ఎరుగని రాజ్యం !!

కామెంట్‌లు