ఉడుత చేసిన మేలు (బాల గేయము);-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చెర్రి పండ్ల చెట్లు అచట
ఎర్రఎర్రని పండ్ల ముచట
ఉడత పిల్లేమొ చూసింది
అది చెట్టు మీదికెక్కింది !

ఎర్రని పండ్లను తెంపింది
పొట్ట నిండది మెక్కింది
నోటిలో పండ్లును పట్టింది
మట్టియంత తవ్వి దాసింది

దాచిన చోటు మరిసింది
వర్షాకాలము వచ్చింది
వాన జల్లు కురిసింది
మట్టిలో దాసిన పండ్లన్నీ

విత్తనాలుగా మారాయి
మొలకలై మొలిచాయి
చెట్లు పెద్దగ ఎదిగాయి
కాయలు ఎన్నో కాశాయి

కాయలన్ని పండాయి
పక్షులెన్నో వచ్చాయి
గూళ్ళు కట్టుకున్నాయి
సంతోషం గా ఉన్నాయి


కామెంట్‌లు