ఆశాజీవి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.

 మానవుడు ఆశాజీవి అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు.  ఆశ ప్రారంభం అయితే అది అంతటితో ఆగదు. అత్యాశ, దురాశ కొరకు పోరాడుతుంది అతిగా కోరుకునే వారికి ఏం వస్తుంది? ఒక లాటరీ వస్తుంది అని డబ్బు కడతాడు. అది కోట్ల రూపాయలు ఎన్ని లక్షల మంది కడతారు అది ఇతనికే వస్తుందన్న నమ్మకం ఏమిటి ఆ నమ్మకంతోనే అనేకసార్లు ప్రయత్నం చేసి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటాడు. అనేక మంది దేవుళ్లకు మొక్కుకుని  ప్రతి రోజు పూజలు చేస్తూ ఉంటాడు. అటు డబ్బు పోతుంది, ఇటు కాలము పోతుంది. దానితో ఆ పేదవాళ్ళు నిరుపేదలుగా మారతారు. అన్నీ కావాలనుకుంటాడు దేనికి ప్రయత్నం చేయలేడు నిజమైన కారణంతో దానికోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఎలా కుదురుతుంది. ఆ జీవిత మర్మాలు తెలుసుకోకపోతే జీవితంలో అన్నీ అనర్థాలే. ఆశ ను మించిన  పాపజాతి మరొకటి లేదు అంటాడు వేమన  తనది కాని దానిని గురించి ఆలోచించి దాని కోసం తపన పడేవాడు మూర్ఖుడు జరగబోయేదేమిటి నిజంగా నిధిని చూసి అది తన కష్టార్జితం కాదని వదిలి వెళ్ళే వాడే నిజమైన యోగి. ఆశ అన్ని అనర్థాలకు మూలం అని 
చెప్పారు వేమన.
 

కామెంట్‌లు